Fingerprints Science: కోట్లాది మంది ఉన్నా మీ వేలిముద్ర మాత్రం ఎందుకు మారదు..?

Fingerprints Science: మన శరీరంలో అత్యంత చిన్నదిగా కనిపించే అంశాల్లో వేలిముద్రలు ఒకటి. కానీ వాటి వెనుక దాగి ఉన్న శాస్త్రం మాత్రం ఎంతో అద్భుతమైనది. ప్రపంచంలో కోట్లాది మంది మనుషులు ఉన్నప్పటికీ ఇద్దరి వేలిముద్రలు పూర్తిగా ఒకేలా ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే వేలిముద్రలను ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన గుర్తింపుగా పరిగణిస్తారు. పోలీసు దర్యాప్తులు నుంచి ఆధునిక సాంకేతిక వ్యవస్థల వరకు వేలిముద్రలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే అవి కేవలం వ్యక్తిగత గుర్తింపుకోసమే కాకుండా మన రోజువారీ జీవితంలో ఎన్నో ముఖ్యమైన పనులకు ఉపయోగపడుతున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. వేలిముద్రల నిర్మాణం మనం జన్మించకముందే ప్రారంభమవుతుంది. గర్భధారణ జరిగిన సుమారు 10వ వారం నుంచే...