Alien Mystery: గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా..?

Alien Mystery: దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, అనుమానాలు, కుట్ర సిద్ధాంతాలకు కేంద్రబిందువుగా మారిన గ్రహాంతరవాసులు, గుర్తించబడని ఎగిరే వస్తువుల మిస్టరీపై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా పెంటగాన్ వద్ద అత్యంత రహస్యంగా ఉంచిన యూఎఫ్ఓ ఫైళ్లను ఇప్పుడు దశలవారీగా బహిర్గతం చేయడం ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ మొదలైనట్లు రక్షణ శాఖ వెల్లడించింది. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ‘ప్రెసిడెన్షియల్ అన్‌సీలింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఫర్ యూఏపీ ఎన్‌కౌంటర్స్’ పేరిట ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి, యూఏపీ, యూఎఫ్ఓలకు సంబంధించిన పాత...