EV India: రూ.1 లక్షలోపే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

EV India: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు వేగంగా పెరుగుతోంది. పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు అంటే ఖరీదైనవిగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రూ.1 లక్షలోపే అద్భుతమైన రేంజ్, ఆధునిక సాంకేతిక ఫీచర్లు, ఆకర్షణీయమైన రూపంతో పలు స్కూటర్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా రోజూ ఉద్యోగాలకు వెళ్లేవారు, విద్యార్థులు, డెలివరీ ఉద్యోగులు పెట్రోల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎంచుకుంటున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చు, మంచి మైలేజ్, పర్యావరణానికి మేలు వంటి అంశాలు ఈవీలకు డిమాండ్...