Coriander: 10 రోజులైనా ఫ్రెస్‌గా ఘుమఘుమలాడుతూ ఉండాలంటే..
Coriander: వంటల్లో రుచిని, సువాసనను పెంచే కొత్తిమీర ప్రతి ఇంటి వంటగదిలో తప్పనిసరిగా ఉండే పదార్థం. అయితే మార్కెట్ నుంచి ఎంతో తాజాగా తీసుకొచ్చిన కొత్తిమీర కేవలం 2 రోజులకే వాడిపోవడం చాలామంది గృహిణులకు ఇబ్బందిగా మారుతోంది. ముఖ్యంగా ఫ్రిజ్‌లో పెట్టినా ఆకులు పసుపురంగులోకి మారడం, కాడలు కుళ్లిపోవడం, వాసన మారిపోవడం తరచూ కనిపించే సమస్యలు. కానీ కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకుంటే కొత్తిమీరను 10 రోజుల వరకు కూడా తాజాగా, పచ్చగా నిల్వ ఉంచుకోవచ్చని వంట నిపుణులు చెబుతున్నారు. సరైన విధంగా భద్రపరిస్తే కొత్తిమీర రుచి, సువాసన అలాగే ఉండటంతో పాటు పదే పదే మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. మార్కెట్ నుంచి...