Crime Thriller: త్రిష నటించిన ఏకైక వెబ్ సిరీస్.. చూస్తే గుండె దడ పుట్టుద్ది

Crime Thriller: దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో కొనసాగుతున్న స్టార్ హీరోయిన్ త్రిష పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రాజకీయంగా ఘన విజయం సాధించడంతో విజయ్‌కు సన్నిహితంగా భావించే సినీ ప్రముఖుల పేర్లు కూడా నెట్టింట మారుమోగుతున్నాయి. ఈ క్రమంలోనే త్రిష నటించిన సినిమాలు, పాత్రలు, వ్యక్తిగత జీవితం, కెరీర్‌కు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు 2 దశాబ్దాలుగా దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష ఇప్పటికీ అదే అందం, అదే క్రేజ్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నా కూడా త్రిష స్థాయిలో అభిమాన...