Actress Rambha: ఆ హీరో ఎంతగానో కష్టపడితే.. పేరు మాత్రం నాకొచ్చింది

Actress Rambha: ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన నటి రంభ తాజాగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, సహనటులు, డ్యాన్స్ అనుభవాలు, వ్యక్తిగత అభిరుచుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎన్నో విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రంభ, తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సమకాలీన నటీమణుల్లో ఎవరు తనకు పోటీగా అనిపించేవారని అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రంభ మాట్లాడుతూ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమెను పోటీగా భావించలేదని, కానీ ఆమెతో కలిసి...