Star Anchor: ‘ఈ జన్మలో మళ్లీ బిగ్‌బాస్ షోకు వెళ్లను’

Star Anchor: బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ కార్యక్రమాల్లో బిగ్ బాస్ తెలుగు ఒకటిగా నిలిచింది. ఈ కార్యక్రమంపై ఎన్నో విమర్శలు వచ్చినా, వివాదాలు తలెత్తినా కూడా దీని ప్రజాదరణ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి సీజన్‌కు కొత్త కొత్త పోటీదారులు, ఆసక్తికరమైన ఆటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు పోటీదారులు బయటకు వచ్చాక చేసిన వ్యాఖ్యలు తరచూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా ప్రముఖ నటి హరితేజ ఈ కార్యక్రమంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. పలు సినిమాలు, ధారావాహికల్లో నటించి గుర్తింపు పొందిన హరితేజ రెండు...