Emergency Alert: కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా?.. ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి

Emergency Alert: శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులందరికీ కేంద్ర ప్రభుత్వం పంపించిన అత్యవసర అలర్ట్ సందేశాలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఒక్కసారిగా మొబైల్ ఫోన్లలో బీప్ శబ్దం వినిపించడంతో చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. సుమారు 10 సెకన్ల పాటు వినిపించిన ఈ శబ్దంతో పాటు వచ్చిన సందేశం అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి రూపొందించిన వ్యవస్థకు సంబంధించినదిగా అధికారులు వివరించారు. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలకు వేగంగా సమాచారం చేరవేయడం లక్ష్యంగా ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా పరీక్షించారు. సెల్ బ్రాడ్‌కాస్ట్ విధానాన్ని ఉపయోగించి టెలికాం విభాగం ఈ...