Weather Update: ఈ నెలలో మండుటెండలు కాదు.. ముంచెత్తే వానలు
Weather Update: ఈ ఏడాది మే నెలలో భారత్ అసాధారణ వాతావరణ మార్పులకు వేదిక కానుందని అంచనాలు వెల్లడవుతున్నాయి. సాధారణంగా ఈ సమయంలో తీవ్ర ఎండలు, వడగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు కానీ 2026లో పరిస్థితి భిన్నంగా ఉండనుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా సాధారణ స్థాయిని మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే సుమారు 110 శాతం కంటే ఎక్కువ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. 1971 నుంచి 2020 వరకు ఉన్న గణాంకాల ప్రకారం మే నెలలో దేశ సగటు వర్షపాతం 64.1 మి.మీ.గా నమోదవుతుండగా, ఈసారి మెజారిటీ ప్రాంతాల్లో దీన్ని మించి...