Millet Diet: ఇలా చేస్తే.. జస్ట్ 10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు

Millet Diet: మిల్లెట్స్‌లో దాగి ఉన్న పోషక విలువలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్, ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. అయినప్పటికీ చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా నూనె పదార్థాలు, అనారోగ్యకరమైన అల్పాహారాలను ఎంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఉదయం అల్పాహారంలో తేలికగా, త్వరగా తయారయ్యే ఆహారం కోసం చూస్తున్న వారికి రాగి ఇడ్లీలు ఉత్తమమైన ఎంపికగా నిలుస్తాయి. రాగిలో ఉండే కాల్షియం, ఫైబర్ శరీరానికి బలం చేకూర్చడమే కాకుండా ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. కడుపును చల్లగా ఉంచే లక్షణం ఉండటంతో పాటు, బరువు తగ్గించుకోవాలనుకునేవారికి కూడా ఇది...