Food Cravings: అర్థరాత్రి ఆకలి అనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

Food Cravings: పగలంతా సమయానికి భోజనం చేసినప్పటికీ రాత్రి వేళల్లో మళ్లీ ఆకలి వేయడం చాలా మందిలో కనిపించే సాధారణ సమస్యగా భావించినా, దాని వెనుక ఆరోగ్య సంబంధిత సంకేతాలు దాగి ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి నిద్రలేచి ఏదైనా తినాలనిపించడం తరచుగా జరుగుతుంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. శరీరానికి అవసరమైన శక్తి, జీవక్రియ మార్పులు, హార్మోన్ల అసమతుల్యత, నిద్రలేమి వంటి అనేక కారణాలు దీనికి దారితీయవచ్చని చెబుతున్నారు. శరీరం అవసరమైన శక్తిని కోరినప్పుడు మెదడు ఆకలి సంకేతాలు పంపుతుందని, దాంతో రాత్రిపూట కూడా తినాలనే భావన కలుగుతుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితిని ‘నైట్ ఈటింగ్...