Tollywood Heroine: పెళ్లి కాకుండా పిల్లల్ని కనొచ్చు..

Tollywood Heroine: వివాహం, సంబంధాలు, వ్యక్తిగత స్వేచ్ఛపై సినీ ప్రముఖుల వ్యాఖ్యలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటి నిత్యా మీనన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు కారణమయ్యాయి. పెళ్లి లేకుండా పిల్లలను కనడంలో ఎలాంటి తప్పూ లేదని, మాతృత్వాన్ని కేవలం వివాహ బంధంతో ముడిపెట్టకూడదని ఆమె చెప్పిన అభిప్రాయాలు ఆసక్తికర చర్చకు తెరలేపాయి. సెలబ్రెటీల జీవితాల్లో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు అన్నవి సాధారణంగా మారిన ఈ కాలంలో, వివాహంపై సంప్రదాయ దృక్పథానికి భిన్నంగా నిత్యా మీనన్ చేసిన వ్యాఖ్యలు పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడని నిత్యా, ఈసారి మాత్రం...