Allahabad: డబ్బు కోసం వివాహ బంధం నవ్వులపాలు
Allahabad: వివాహ బంధాన్ని ఆర్థిక లాభాల సాధనంగా మార్చిన దిగ్భ్రాంతికర ఘటనలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భార్య పేరు మీద లక్షల రూపాయల రుణాలు తీసుకుని, కారు, నగలు, ఇతర విలువైన వస్తువులతో పరారైన భర్తే తిరిగి అదే భార్య నుంచి భరణం కోరడం ఈ కేసులో సంచలనంగా మారింది. 2019 మే 18న వివాహం చేసుకున్న ఈ జంట మధ్య మొదట సవ్యంగా సాగిన దాంపత్యం తర్వాత తీవ్ర విభేదాలకు దారి తీసింది. పెళ్లికి ముందు ఇద్దరూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా, తర్వాత భార్యకు ఉద్యోగం లభించగా భర్త ప్రభుత్వ ఉద్యోగం పొందలేక ఎల్ఎల్బి పూర్తి చేసి న్యాయవాదిగా పని ప్రారంభించాడు....