IPL 2026: ధోనీ ఆడకపోవడానికి గాయం కారణం కాదా.. అసలు నిజం ఇదే..?

IPL 2026: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ పుంజుకుని విజయపథంలో దూసుకెళ్తున్నప్పటికీ, మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో కనిపించకపోవడం అభిమానుల్లో ఆందోళన, ఆసక్తి రెండింటినీ పెంచుతోంది. సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా మిస్టర్ కూల్ ఒక్క మ్యాచ్‌లోనూ బరిలోకి దిగకపోవడంతో గాయం కారణంగానే అతడు దూరంగా ఉన్నాడని అందరూ భావించారు. అయితే ధోనీ ఆడకపోవడానికి అసలు కారణం వేరే ఉందన్న వార్త ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గాయం ఒక్కటే కారణం కాదని, జట్టు ప్రయోజనాల కోసమే ధోనీ తన రీఎంట్రీని ఆలస్యం చేస్తున్నాడని తాజా సమాచారం చెబుతోంది. జట్టులో ప్రస్తుతం ఏర్పడిన విన్నింగ్ కాంబినేషన్‌ను చెడగొట్టకూడదనే ఉద్దేశంతోనే...