Uttar Pradesh: ముఖానికి కేక్ పుశారని ఇంత ఘోరమా..?
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో చిన్నపాటి సరదా వివాదం క్షణాల్లో రక్తపాతంగా మారి ముగ్గురు యువకుల ప్రాణాలను బలితీసుకున్న ఘటన తీవ్ర సంచలనం రేపింది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకగా మొదలైన ఆనంద క్షణాలు, అనూహ్యంగా కాల్పుల మోతతో విషాదాంతమవడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఖుర్జా నగర్ పరిధిలోని నెహ్రూపూర్ చుంగి, సుభాష్ రోడ్డులో ఉన్న జిమ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. జీతూ అనే యువకుడి పుట్టినరోజు సందర్భంగా అతని స్నేహితులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని వేడుకలు నిర్వహిస్తుండగా, కేక్ కటింగ్ అనంతరం సరదాగా అతని ముఖానికి కేక్ పూయడం మొదలైంది. సాధారణంగా నవ్వుల్లో ముగియాల్సిన ఈ ఘటన, అనూహ్యంగా ఉద్రిక్తతకు దారి తీసింది....