Ashu Reddy: బంగారం ఫ్లాట్‌లు, కార్లు అన్నీ కొనిపించుకుంది.. చివరకు

Ashu Reddy: నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డిపై నమోదైన కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. పెళ్లి పేరుతో మోసం చేసి భారీ మొత్తంలో డబ్బులు, బంగారం, ఆస్తులు కాజేసిందంటూ లండన్‌లో స్థిరపడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వైవి ధర్మేంద్ర హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. షేక్‌పేట్‌కు చెందిన ధర్మేంద్ర 2018లో భారత్‌కు వచ్చిన సమయంలో అషురెడ్డితో పరిచయం ఏర్పడిందని, అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చానని ఆమె తనకు చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పరిచయం ప్రేమగా మారి, పెళ్లి చేసుకుందామని నమ్మించి తన నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుందని...