Hyderabad: ఇకపై పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో
Hyderabad: హైదరాబాద్ మహానగర రవాణా వ్యవస్థలో కీలకమైన మెట్రో రైల్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం చారిత్రాత్మక మలుపుగా మారింది. ఇప్పటి వరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో కొనసాగుతున్న మెట్రో ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ మెట్రోకు చెందిన 100% ఈక్విటీని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో, హైదరాబాద్ మెట్రో పూర్తిస్థాయిలో ప్రభుత్వ యాజమాన్యంలోకి చేరింది. ఈ పరిణామం మెట్రో భవిష్యత్తు దిశను పూర్తిగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాజమాన్య బదిలీతో పాటు మెట్రో పరిపాలన, నిర్వహణ, విస్తరణకు సంబంధించిన కీలక బాధ్యతలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం కొత్త బోర్డు ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా నగర రవాణా...