Kiera Juice: ఎండాకాలం బాడీని కూల్‌గా ఉంచే బ్రహ్మాస్త్రం..
Kiera Juice: వేసవి కాలం ప్రారంభమైన వెంటనే శరీరాన్ని చల్లబరచే ఆహారాలపై ప్రతి ఒక్కరూ దృష్టి పెడతారు. అలాంటి సమయంలో అందరికీ సులభంగా దొరికే, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే కూరగాయగా కీర దోసకాయ ప్రత్యేక గుర్తింపు పొందింది. మన రోజువారీ ఆహారంలో సలాడ్ రూపంలో తరచూ తీసుకునే ఈ కూరగాయ కేవలం రుచికోసం మాత్రమే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తూ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఏడాది పొడవునా అందుబాటులో ఉండే కీర దోసకాయ ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది. సాధారణంగా కిలోకు రూ.30 వరకు లభించే ఈ కూరగాయ వేసవిలో ప్రత్యేకంగా తీసుకుంటే శరీరానికి ఎంతో...