Marriage Age: పెళ్లి చేసుకోవడానికి అసలైన వయస్సు ఏది..?

Marriage Age: భారతదేశంలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం వివాహానికి మహిళలకు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లు పూర్తి కావాలి అనే నిబంధనలు ఉన్నప్పటికీ, ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ఈ వయస్సు మాత్రమే సరిపోదని నిపుణులు చెబుతున్నారు. కేవలం వయస్సు చేరుకోవడం కాకుండా, ఒక వ్యక్తి మానసికంగా బాధ్యతలను స్వీకరించే స్థితిలో ఉండడం, ఆర్థికంగా స్థిరపడటం వంటి అంశాలు కూడా వివాహ నిర్ణయంలో కీలకంగా మారాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగాలంటే వ్యక్తిలో స్థిరమైన ఆలోచన, బాధ్యతాయుతమైన ప్రవర్తన ఉండాలని మనస్తత్వ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం 25 నుండి 30 ఏళ్ల మధ్య...