Pahalgam attack: ఏడాది తర్వాత కూడా మానని గాయం

Pahalgam attack: ఏప్రిల్ 22.. సాధారణంగా వేసవి సెలవుల మధ్యలో వచ్చే మరో సాధారణ రోజు మాత్రమే కావాలి. కానీ భారత చరిత్రలో ఈ తేదీ మాత్రం చెరిగిపోని ముద్రగా నిలిచిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతం ఒక్కసారిగా రక్తపాతం చూసింది. ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచే ఆ పచ్చిక బయళ్లు, అమాయకుల రక్తంతో తడిసి దేశాన్ని కలచివేశాయి. 26 మంది నిరపరాధ పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఆ ఘటన నేటికీ ప్రతి భారతీయుడి మనసులో గాయంగా మిగిలి ఉంది. ఒకవైపు దుఃఖం, మరోవైపు దేశం చూపించిన ప్రతిస్పందన గర్వకారణంగా మారిన రోజు ఇది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసారన్...