High Court: కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట

High Court: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టు కీలక ఊరట కల్పించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే నిర్ణయం మాజీ మంత్రి హరీష్‌రావు, స్మిత సభర్వాల్, ఎస్‌కే జోషిలకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది. దీంతో ఈ కేసులో కీలక మలుపు తిరిగినట్టైంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవతవకలపై నిజానిజాలు వెలికితీయడానికి కమిషన్ ఏర్పాటు చేయడం సరైనదేనని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే కమిషన్ చట్టబద్ధమైనదే అయినప్పటికీ, దాని నివేదిక...