Suicide: కాబోయే భార్యతో వింత ప్రవర్తన.. ఆమె మనస్తాపంతో..
Suicide: కడప నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జీవితంలో కొత్త దశకు అడుగుపెట్టబోతున్న ఓ యువతి, కాబోయే భర్త ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పటేల్ రోడ్డుకు చెందిన రెహానా ఇటీవల యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ పూర్తి చేసి గవర్నర్ చేతుల మీదుగా పట్టా పొందింది. విద్యలో ప్రతిభ కనబరిచిన ఆమె భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో ప్రొద్దుటూరుకు చెందిన ఐటీ ఉద్యోగి షాజహాన్తో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ పరిణామంతో రెహానా జీవితంలో కొత్త ఆశలు మొదలయ్యాయి. నిశ్చితార్థం అనంతరం రెహానా, షాజహాన్...