Crime: మద్యం మత్తులో యువకుడిని తలక్రిందులుగా వేలాడదీసిన మందుబాబులు
Crime: గుంటూరు నగరంలో మరోసారి మద్యం మత్తులో జరిగిన హింసాత్మక ఘటన కలకలం రేపింది. కంకరగుంట గేటు సమీపంలోని నిర్మలా వైన్స్ వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు స్నేహితులపై అన్నదమ్ములు దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాత్రి వేళ వైన్స్ పై అంతస్తులో మందుబాబులతో కోలాహలం నెలకొన్న సమయంలో బుంగ బాలకృష్ణ, మారుతి పూర్ణచంద్రరావు ఇద్దరూ ఒకే టేబుల్ వద్ద కూర్చొని మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో ఎదురు టేబుల్ వద్ద దేవరకొండ స్వరూప్ నగర్, శశికుమార్ అన్నదమ్ములు కూడా మద్యం తాగుతున్నారు. కొద్దిసేపటికి అన్నదమ్ములిద్దరూ గట్టిగా మాట్లాడుకోవడం ప్రారంభించగా, ఆ శబ్దం వైపు పూర్ణచంద్రరావు చూడడం వివాదానికి నాంది...