Breakfast Benefits: హెల్తీ టిఫిన్స్.. మోకాళ్లు, నడుము నొప్పులు చిటికెలో మాయం!

Breakfast Benefits: ప్రతిరోజూ ఒకే విధమైన అల్పాహారాలు తింటూ బోర్‌గా అనిపిస్తే, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త మార్పులు చేసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా ఉండే ఆహారాన్ని ఎంపిక చేసుకుంటే ఆరోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఇటీవలి కాలంలో చాలామంది మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాగితో తయారయ్యే అల్పాహారాలు శరీరానికి బలం ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రాగిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే రాగి ఇడ్లీ, రాగి దోశలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. రాగి...