Spiritual: ఆడ రూపంలో దర్శనమిచ్చే ఆంజనేయుడు ఎక్కడో తెలుసా..?
Spiritual: భారతదేశం ఆధ్యాత్మిక సంపదకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. దేశం నలుమూలలా అనేక దేవాలయాలు ఉండగా, ప్రతి ఆలయానికి తనదైన విశిష్టత ఉంది. ముఖ్యంగా హనుమంతుని ఆరాధన భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. శక్తి, భక్తి, ధైర్యానికి ప్రతీకగా భావించే హనుమంతుడు విభిన్న రూపాల్లో దర్శనమిస్తూ భక్తులను ఆశ్చర్యపరుస్తాడు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక హనుమాన్ ఆలయాల్లో కొన్ని మాత్రం తమ ప్రత్యేకతలతో భక్తుల మనసులను ఆకట్టుకుంటూ, విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రతన్పూర్ ప్రాంతంలో ఉన్న గిరిజాబంధ్ హనుమాన్ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. సాధారణంగా పరాక్రమశాలి రూపంలో దర్శనమిచ్చే హనుమంతుడు ఇక్కడ మాత్రం స్త్రీ స్వరూపంలో కొలువై...