Gardening: కరివేపాకు మొక్క గుబురుగా పెరగాలంటే.. ఇది ఒక చెంచా వేస్తే చాలు..

Gardening: ఇంటి ఆహారంలో రుచి, సువాసన కోసం కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది తమ ఇంటి పెరట్లో లేదా కుండీలలో కరివేపాకు మొక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ మొక్కను ఆరోగ్యంగా, గుబురుగా పెంచుకోవడం కోసం సరైన పద్ధతులు తెలుసుకోవడం అవసరం. సరైన నేల మిశ్రమం నుంచి పోషకాల వరకు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పాటిస్తే కరివేపాకు మొక్క వేగంగా, దట్టంగా పెరుగుతుంది. కరివేపాకు మొక్కకు బలమైన వేర్లు పెరగాలంటే సరైన నేల మిశ్రమం చాలా ముఖ్యం. ఎర్ర మట్టి, ఇసుక, ఆవు పేడ, ఎముక పొడి, వేపపిండి సమాన పరిమాణాల్లో కలిపి ఉపయోగిస్తే నీటి పారుదల బాగా జరుగుతుంది....