Psychology: నో చెబితే తట్టుకోలేకపోతున్నారంటే లైట్ తీసుకోవద్దు

Psychology: జీవిత ప్రయాణంలో విమర్శలు, తిరస్కరణలు తప్పనిసరిగా ఎదురవుతాయి. కొంతమంది వాటిని ధైర్యంగా స్వీకరించి ముందుకు సాగుతారు. అయితే మరికొందరు మాత్రం చిన్న వ్యాఖ్యకే గుండెల్లో భారంగా మిగిలే బాధను అనుభవిస్తారు. ఎవరైనా సరదాగా మాట్లాడినా, ‘నో’ అని చెప్పినా తీవ్రంగా బాధపడటం, మనసులో తెలియని ఒత్తిడి పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని కేవలం అతిగా స్పందించడం అని భావించడం సరైంది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది రిజెక్షన్ సెన్సిటివ్ డిస్ఫోరియా అనే ప్రత్యేకమైన మానసిక స్థితికి సంబంధించినదిగా భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఉన్నవారిలో చిన్న సరదా వ్యాఖ్య కూడా అవమానంగా అనిపించడం సాధారణం. ఎవరో తమ లోపాన్ని గుర్తు చేసినా లేదా...