Mohammed Ayub: కేంద్రంపై కాంగ్రెస్ నేత విమర్శలు
Mohammed Ayub: వరంగల్ జిల్లాలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మహిళా రిజర్వేషన్ అంశాన్ని డిలిమిటేషన్ ప్రక్రియతో అనుసంధానించి ముందుకు తీసుకురావాలని కేంద్రం ప్రయత్నించిందని, ఆ వ్యూహాన్ని తిప్పికొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందకపోవడంతో ఇప్పుడు ప్రతిపక్షాలపై అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. మహిళల హక్కుల విషయంలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు కలపకుండా, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రత్యేకంగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా పాకిస్తాన్తో...