Kavitha: కొత్త పార్టీ గుబులు.. తెలంగాణ జాగృతిలోకి మాజీ ఎమ్మెల్యేల క్యూ..?
Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజలకు సేవ చేయడంలో అడ్డంకిగా మారిన పాత రాజకీయ శక్తులను పక్కనబెట్టి, కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరడం ఈ దిశగా కీలక పరిణామంగా నిలిచింది. కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించిన కవిత, తెలంగాణ సాధన కోసం కలిసి పోరాడిన నాయకులు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్కటిగా నిలవాలని పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాన్ని గుర్తు చేసుకున్న...