Cyber Crime: ఒక్క లింక్.. జీవితకాలపు పొదుపు మాయం!

Cyber Crime: టెక్నాలజీ అభివృద్ధితో మన జీవితం ఎంతో సులభతరం అయినప్పటికీ, అదే సాంకేతికతను ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పోలీసులు, అధికారులు ఎంతగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, మీడియా పదేపదే హెచ్చరిస్తున్నా, కొంతమంది నిర్లక్ష్యం, అత్యాశ లేదా అవగాహన లోపం కారణంగా మోసగాళ్ల బారిన పడుతున్నారు. ఒక చిన్న తప్పిదం ఎంత పెద్ద నష్టానికి దారితీస్తుందో తాజా ఘటన మరొకసారి స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నగర పరిధిలో జరిగిన ఈ సంఘటన ప్రజలను అప్రమత్తం చేస్తోంది. నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఒక యువతిని నితీష్ అనే పేరుతో పరిచయమైన వ్యక్తి లక్ష్యంగా...