Madhya Pradesh: బురఖాలో వచ్చిన కూతుర్ని చూసి తల్లిదండ్రులు షాక్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సమాజాన్ని కలవరపరిచే ఒక ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని మోసం చేసి, శారీరకంగా వేధింపులకు గురిచేసిన ఒక గ్యాంగ్ కార్యకలాపాలు బయటపడటంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. అశోక్‌నగర్ ప్రాంతానికి చెందిన ఒక బాలిక అనుమానాస్పద పరిస్థితుల్లో ఇంటికి చేరుకోవడంతో ఈ ఘటనపై నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమె పరిస్థితిని గమనించి ప్రశ్నించగా, జరిగిన దారుణాలపై ఆమె వివరాలు వెల్లడించడంతో ఈ కేసు తీవ్రత మరింత స్పష్టమైంది. అశోక్‌నగర్ జిల్లాలోని పిప్రాయ్ ప్రాంతానికి చెందిన ఈ మైనర్ బాలిక సుమారు 4 నెలల క్రితం రైల్వే స్టేషన్ వద్ద...