BTech Courses 2026: JEE Advanced అభ్యర్థులకు అలర్ట్.. NITల్లో కొత్త కోర్సుల్లో ఇవే..
BTech Courses 2026: జేఈఈ మెయిన్ 2026 రెండో దశ ఫలితాలను ఏప్రిల్ 20న విడుదల చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. జనవరి, ఏప్రిల్ సెషన్లలో విద్యార్థులు సాధించిన ఉత్తమ మార్కులను పరిగణలోకి తీసుకుని ఆల్ ఇండియా ర్యాంక్‌ను ఖరారు చేస్తారు. జేఈఈ మెయిన్‌లో అగ్రస్థానాల్లో నిలిచిన సుమారు 2.50 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధిస్తారు. అనంతరం ఆ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జాతీయ సాంకేతిక సంస్థల్లో ప్రవేశాలు లభిస్తాయి. అయితే చాలా మంది విద్యార్థులు ఇప్పటికీ సంప్రదాయ కోర్సులైన కంప్యూటర్ సైన్స్,...