Kangana Ranaut: అంతరించిపోతున్న చేనేత కళకు ప్రాణం పోస్తున్న సెలబ్రిటీలు
Kangana Ranaut: ఏ ఒక్క ప్రాంతానికో చెందిన సాధారణ వస్త్రం కాదు.. ఏకంగా ఎనిమిది వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన రాజవంశీయుల ఆభరణం. ఒకప్పుడు తంజావూరు రాణుల కోసం మాత్రమే ప్రత్యేకంగా నేసే ‘కొడాలి కరుప్పూర్’ చీరను ఆమె ధరించడంతో మన ప్రాచీన నేత కార్మికుల నైపుణ్యం మరోసారి ప్రపంచానికి తెలిసింది. నాటి రాజుల వస్త్రాలంకరణ వైభవాన్ని చాటిచెప్పే ఈ అద్భుతమైన చీర విశేషాలేంటో తెలుసుకుందాం.. తంజావూరు రాజవంశీయుల ప్రత్యేక పోషణలో.. కొడాలి కరుప్పూర్ చీరల చరిత్ర చాలా లోతైనది. 1787 నుండి 1832 మధ్య తంజావూరును పాలించిన మరాఠా పాలకుడు సర్ఫోజీ రాజా భోంస్లే చత్రపతిII హయాంలో ఈ వస్త్ర కళ అత్యున్నత...