Teertham Rules: తీర్థం తీసుకునేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు!
Teertham Rules: దేవాలయాల్లో లేదా ఇంట్లో పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అందించే తీర్థం ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. అయితే చాలామంది దీనిని స్వీకరించే సమయంలో సరైన విధానం పాటించకపోవడం కనిపిస్తుంది. తీర్థాన్ని స్వీకరించడానికి శాస్త్రోక్తంగా చెప్పబడిన ప్రత్యేక విధానాన్ని ‘గోకర్ణ కృతి’ లేదా ‘గోకర్ణ ముద్ర’ అని అంటారు. ఈ విధానంలో చేతి వేళ్లను ఆవు చెవి ఆకారంలో ఉంచడం ముఖ్యంగా భావిస్తారు. చూపుడు వేళ్లను బొటనవేలు చివరి భాగాన్ని తాకేలా మడిచి, బొటనవేలిని దానిపై ఉంచాలి. మిగిలిన మూడు వేళ్లు నిటారుగా ఉండేలా ఏర్పాటు చేసి, దోసిలి పట్టినట్లుగా చేతిని వంచి పవిత్ర జలాన్ని అరచేతి మధ్య భాగంలో స్వీకరించాలి. ఈ విధంగా...