Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందంటే..?
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు మండుతున్న ఎండ, మరోవైపు ఉక్కపోత, వేడిగాలుల ప్రభావంతో బయటకు వెళ్లడమే కష్టంగా మారింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ – నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రాబోయే రోజుల్లో వేడి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర...