PM RAHAT: రోడ్డు ప్రమాద బాధితులకు గుడ్ న్యూస్.. లక్షన్నర వరకు ఉచిత వైద్యం

PM RAHAT: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అందాల్సిన చికిత్స ఆలస్యం కావడం, చేతిలో డబ్బు లేకపోవడం వంటి కారణాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో, అలాంటి పరిస్థితులను నివారించేందుకు కొత్త పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ నెల 11 నుండి ప్రారంభమైన “ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల ఆస్పత్రి చేరిక మరియు హామీచేసిన చికిత్స” పథకం ద్వారా ప్రమాదంలో గాయపడిన వారికి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే తక్షణ వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. అత్యవసర సమయంలో ‘గోల్డెన్ అవర్’లో చికిత్స అందించడం ద్వారా...