Telangana: దేవాదాయ శాఖలో 190 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్

Telangana: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర దేవాదాయ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాలు, ధార్మిక సంస్థల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ తాజాగా అనుమతులు జారీ చేసింది. మొత్తం 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పోస్టులన్నీ రెవెన్యూ (దేవాదాయ) శాఖ పరిధిలోని కమిషనర్ కార్యాలయం ఆధ్వర్యంలో భర్తీ కానున్నాయి. ఈ నియామక ప్రక్రియను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనుంది....