Nizamabad: ఊర్లోకి రాకుండా హిజ్రాలపై నిషేధం

Nizamabad: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ గ్రామంలో హిజ్రాల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గ్రామంలో జరిగే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల సమయంలో భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు, స్థానికులు కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోకి హిజ్రాలు రాకుండా నిషేధం విధిస్తూ గ్రామ అభివృద్ధి కమిటీ తీర్మానం చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. ఇటీవల శుభకార్యాల సమయంలో కొందరు హిజ్రాలు ఇంటింటికీ వెళ్లి రూ.వేలల్లో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే...