Siberian Husky: విదేశీ జాతి కుక్కలకు ‘దేశీ’ కష్టాలు..!
Siberian Husky: సంగారెడ్డి జిల్లాలో ఖరీదైన విదేశీ జాతికి చెందిన సైబీరియన్ హస్కీ కుక్కలను నడిరోడ్డుపై వదిలిపెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పెంపుడు జంతువులను ఫ్యాషన్, ప్రతిష్ఠ కోసం కొనుగోలు చేసి, తర్వాత వాటిని సంరక్షించలేక వీధుల్లో వదిలేస్తున్న ఘటనలు పెరుగుతున్న వేళ ఈ సంఘటన జంతు ప్రేమికుల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. నందిగామ గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న సైబీరియన్ హస్కీ కుక్కలపై సమాచారం అందుకున్న బీడీఎల్ భానూరు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలు, వాహనాల కదలికలను క్షుణ్ణంగా పరిశీలించి చివరకు ఈ ఘటనకు బాధ్యులైన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో ఫతేనగర్‌కు చెందిన సత్యనారాయణ, హనుమాన్‌పేటకు...