CM Chandrababu: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన 7వ జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా వేగం, క్షేత్రస్థాయి పాలన, మౌలిక వసతులు, రవాణా వ్యయాలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అనేక అంశాలపై అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన సంకేతాలు ఇస్తూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామీణ, పట్టణ స్థాయిలో ప్రభుత్వ పనితీరు ప్రజలకు నేరుగా కనిపించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్వర్ణాంధ్ర విజన్...