Telangana: భూముల మార్కెట్ విలువల పెంపుకు ప్రభుత్వం సన్నాహాలు

Telangana: తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న ధరలు, వాస్తవ మార్కెట్ ధరల మధ్య భారీ అంతరం ఉండటంతో కొత్త విలువలను ఖరారు చేసే దిశగా అధికారులు వేగంగా అధ్యయనం చేస్తున్నారు. జిల్లాల వారీగా భూముల కొనుగోలు విక్రయాల వివరాలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు, నిర్మాణ రంగ అభివృద్ధి, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తూ ప్రాంతాలవారీగా కొత్త రేట్లపై నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ నగరం, ఓఆర్‌ఆర్ పరిధి, వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లో భారీ పెంపు ఉండే అవకాశాలపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది....