Muhammad Ayub: ‘రైతుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు’
Muhammad Ayub: వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం వరంగల్లో నిర్వహించిన రైతు సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై పరుష పదజాలం ఉపయోగించడం, అన్ పార్లమెంటరీ భాషలో విమర్శలు చేయడం పూర్తిగా అనుచితమని ఆయన అన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న సమయంలో ప్రజల సంపదను దోచుకున్నవారికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతు సభ పేరుతో కాంగ్రెస్...