Viral News: హెల్మెట్ తప్పనిసరి అంటూ పిల్లల లేఖలు
Viral News: మంచిర్యాల జిల్లాలో హృదయాన్ని కదిలించే ఒక ప్రత్యేక కార్యక్రమం రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ భావోద్వేగాన్ని రేకెత్తించింది. “ప్రియమైన నాన్నా… నువ్వంటే నాకు ప్రాణం.. నువ్వుంటేనే మా బంగారు భవిష్యత్. నాన్న నువ్వెప్పుడు చల్లగా ఉండాలి.. బైక్ పై బయటకు వెళితే మాత్రం జాగ్రత్తగా ఉండాలి.. హెల్మెట్ తప్పక ధరించాలి.. క్షేమంగా ఇంటికి రావాలి.. మరిచిపోకు నీకోసం ఇక్కడ ఓ ప్రాణం ఎదురు చూస్తూ ఉంటుంది” అంటూ చిన్నారి మనసులోని ఆప్యాయతను పదాల రూపంలో వ్యక్తం చేసిన లేఖలు అందరినీ కదిలించాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కేజీబీవీ పాఠశాల విద్యార్థులు తమ తండ్రుల కోసం రాసిన ఈ పోస్ట్ కార్డ్ లేఖలు...