Thriller: నిజమైన సంఘటనలతో తెరకెక్కించిన డాక్యుమెంటరీ.. ఓటీటీలో ట్రెండింగ్

Thriller: ఇటీవల కాలంలో హారర్, సస్పెన్స్, మిస్టరీ తరహా కంటెంట్‌కు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా ఓటీటీ వేదికలపై ప్రతి రోజు కొత్త చిత్రాలు, సిరీస్‌లు విడుదలవుతుండగా, అందులో నిజ సంఘటనల ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీలకు ప్రత్యేక స్పందన లభిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ కంటెంట్‌ను ఆసక్తిగా చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను ఒక్కసారిగా కుదిపేస్తూ, మానవత్వంపై ఉన్న నమ్మకాన్నే ప్రశ్నించేలా చేసే ఒక డాక్యుమెంటరీ ఇప్పుడు విపరీతంగా చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 3న ఓటీటీలో విడుదలైన ‘ది టర్పిన్స్: ఎ న్యూ హౌస్ ఆఫ్ హారర్’ అనే ఈ డాక్యుమెంటరీ, ఒక సాధారణ...