Guilt-Tripping: లవ్ పేరుతో మెంటల్‌గా కంట్రోల్ చేస్తున్నారా?
Guilt-Tripping: సంబంధాల్లో కనిపించని ఒత్తిడులు చాలా సార్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి. అలాంటి వాటిలో ఒకటి గిల్ట్ ట్రిప్పింగ్. ఇది ఒక వ్యక్తి తన అవసరాలను నేరుగా చెప్పకుండా, ఎదుటివారిలో అపరాధ భావం కలిగించి తనకు అనుకూలంగా ప్రవర్తింపజేయడానికి ఉపయోగించే భావోద్వేగ పద్ధతి. సాధారణంగా ఇది చాలా సున్నితంగా జరుగుతుంది. నిందలు వేయడం, నిరాశను వ్యక్తపరచడం లేదా మాటలలో బాధను చూపించడం ద్వారా ఎదుటివారిని ప్రభావితం చేయడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో ఇది తెలియకుండానే జరుగుతుంటుంది, ముఖ్యంగా సన్నిహిత సంబంధాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ దీని ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. ఎదుటివారు తాము చేయని తప్పుకూ బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది....