Indian Politics: ఇకపై 850కి చేరనున్న లోక్సభ సీట్ల సంఖ్య!
Indian Politics: దేశ రాజకీయ దిశలో త్వరలోనే భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా లోక్సభ స్థానాల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్యను 850కు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రూపొందించిన బిల్లు ముసాయిదాను ఇప్పటికే పార్లమెంట్ సభ్యులకు పంపించినట్లు సమాచారం. జనాభా ఆధారంగా రాష్ట్రాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. ప్రతిపాదిత మార్పుల ప్రకారం మొత్తం 850 స్థానాల్లో 815 స్థానాలను రాష్ట్రాలకు...