Telugu Actress: ఈ డెకాయిట్ పిల్ల స్టార్ హీరో కోడలు అని తెలుసా?

Telugu Actress: బాలీవుడ్‌లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వారసులు సినీ రంగంలోకి అడుగుపెట్టడం సాధారణ విషయమే అయినప్పటికీ, వారసత్వం ఆధారంగా కాకుండా తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించడం మాత్రం కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి వారిలో జైన్ మేరీ ఖాన్ ఒకరు. ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ కుటుంబానికి చెందిన ఈమె, తనకు ఉన్న సినీ నేపథ్యాన్ని పక్కనబెట్టి, నిశ్శబ్దంగా తనకంటూ ఒక స్థిరమైన స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది. ఇమ్రాన్ ఖాన్, జునైద్ ఖాన్ వంటి కుటుంబ సభ్యులు సినీరంగంలో ఉన్నప్పటికీ, జైన్ తన ప్రయాణాన్ని స్వతంత్రంగా నిర్మించుకోవడం ప్రత్యేకతగా నిలుస్తోంది. 1993 మార్చి 20న జన్మించిన జైన్ మేరీ ఖాన్, ప్రముఖ దర్శకుడు మన్సూర్...