Weather Update: అన్నదాతలకు బ్యాడ్ న్యూస్
Weather Update: దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది లాంటి వ్యవసాయ రంగంపై ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ఎల్ నినో ప్రభావం కారణంగా రుతుపవనాలు బలహీనపడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. దీర్ఘకాలిక రుతుపవన అంచనాలను విడుదల చేసిన భారత వాతావరణ శాఖ చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర ఈ ఏడాది వర్షపాతం...