Women Seats: మహిళా నేతల సర్వే సమరం!

అధ్యక్షా అనేందుకు లేడి లీడర్లు రెడీ.. ఆ 40 సీట్లపై మహిళా నేతల కన్ను..? Women's Seats: డిలిమిటేషన్ తర్వాత తెలంగాణలో సుమారు 40 అసెంబ్లీ స్థానాలు మహిళలకు ప్రత్యేకంగా కేటాయించే అవకాశం ఉందనే చర్చ మొదలవడంతో రాజకీయ వర్గాల్లో కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘అధ్యక్ష’ స్థాయికి ఎదగాలని భావిస్తున్న మహిళా నాయకులు ఇప్పటినుంచే తమ రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. నియోజకవర్గాల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, జనాభా ప్రాతిపదికన వాటిని స్వతంత్రంగా విశ్లేషించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రైవేట్ సంస్థల సహాయంతో సర్వేలు నిర్వహిస్తూ, కుల గణన లెక్కలు, ప్రాంతాల వారీగా ఓటర్ల విభజన వంటి అంశాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ...