KTR vs Kavitha: టీఆర్ఎస్ ఎవరిది?

అన్న ఆవేశం.. చెల్లి పోరాటం గులాబీ కోటలో కొత్త రాజకీయం! KTR vs Kavitha: తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు అప్రతిహత శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ అనే పేరు మరోసారి చర్చల కేంద్రంగా మారింది. పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోవడం, అధికారాన్ని కోల్పోవడం వంటి పరిణామాల మధ్య పాత బ్రాండ్ వైపు తిరిగి చూడాలనే ఆలోచన బలపడుతోంది. పార్టీ పేరు మార్పుతో రాజకీయంగా నష్టపోయామని భావిస్తున్న నేతలు, క్యాడర్‌లోనూ ఈ అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేటీఆర్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని, తుది నిర్ణయం ఆయనదేనని...